1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

శ్రీహరి ప్రధాన పాత్రలో "రోమియో"!

వినోదం వెండితెర కథనాలు సుధా ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌ రామకృష్ణ దర్శకత్వం శ్రీహరి ప్రధాన పాత్ర ఆర్యన్ రాజేష్ శ్రద్ధా ఆర్య
WD
సుధా ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై రామకృష్ణ దర్శకత్వంలో శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం "రోమియో". శ్రీహరి ప్రధాన పాత్రలో ఆర్యన్ రాజేష్, శ్రద్ధా ఆర్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్‌ సన్నివేశాన్ని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన విలేకరుల సమావేశంలో శ్రీహరి మాట్లాడుతూ.... దర్శకుడు చెప్పిన దానికంటే.. చాలా అద్భుతంగా సినిమాను తెరకెక్కిస్తున్నారని చెప్పారు. సినిమా ప్రేక్షక్షుడికి థ్రిల్‌గా ఉంటుందని వెల్లడించారు. సినిమాలో తాను అనీల్ అంబానీలా శ్రీమంతుడి పాత్ర పోషిస్తున్నానని చెప్పారు. తన చెల్లిగా నటిస్తున్న శ్రద్ధాఆర్య మనస్సును హీరో ఎలా పొందాడన్నదే సినిమా కథని చెప్పారు.

కథానాయకుడు ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ... సినిమాలో పాటలు బాగున్నాయని, ఇందులో ఫైట్స్ హైలెట్‌గా నిలుస్తాయని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ.... ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి 75 శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పారు. సెప్టెంబర్ 25వతేదీవరకు జరిగే షూటింగ్‌తో రెండు పాటలు మినహా సినిమా పూర్తవుతుందని తెలిపారు. శ్రీహరికి పి.ఎగా రఘుబాబు నటిస్తుండగా... విలన్‌ పాత్రను చరణ్‌రాజ్ పోషిస్తున్నారు.
About Writer
Harsha Vardhan