1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

శరవేగంగా "అ..ఆ...ఇ...ఈ" షూటింగ్!

వినోదం వెండితెర కథనాలు శ్రీకాంత్ మీరాజాస్మిన్ సదా కాంబినేషన్‌ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం అ..ఆ...ఇ...ఈ
WD
శ్రీకాంత్, మీరాజాస్మిన్, సదా కాంబినేషన్‌లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం "అ..ఆ...ఇ...ఈ" (అతను ఆమె... ఇంతలో ఈమె). శ్రీకల్పన ఆర్ట్స్ పతాకంపై బొద్దం అశోక్ యాదవ్ నిర్మిస్తోన్న ఈ సినిమా 25శాతం టాకీ, ఓ పాట చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... షూటింగ్ ఎక్కువ భాగం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోందని, శ్రీకాంత్, సదాపై ఓ పాటను చిత్రించామని, నాలుగు సెట్లలో స్వర్ణ డాన్సర్ నేతృత్వంలోని భాస్కరభట్ల రాసిన శ్రీమంతం పాటను చిత్రీకరించారని వెల్లడించారు. ఎం.ఎం.శ్రీలేఖ చక్కని బాణీలు సమకూర్చిందని, నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అనుకున్నట్లు తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత శేఖర్ మాట్లాడుతూ... ఈ నెల నాలుగోతేదీ వరకు రామోజీ ఫిలింసిటీలో షెడ్యూల్ జరుగనుందని, 5 నుంచి రాక్‌కాజిల్‌లో కాలనీ సన్నివేశాల చిత్రీకరణ జరుగనుందని తెలిపారు. చక్కని కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుందని ఆయన చెప్పారు. శ్రీనివాసరెడ్డి చిత్రాల్లో బెస్ట్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకముందని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ... ఇందులో శ్రీకాంత్ క్యాబ్‌డ్రైవర్‌గా నటిస్తున్నారని, ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్‌తో పాటు అన్ని అంశాలు మేళవించిన కథాంశమిదని, టైటిల్ గమ్మత్తుగా ఉందని, శోభన్‌బాబు గారి సినిమా తరహాలో ఈ చిత్రముంటుందన్నారు.

ఇంకా ఈ చిత్రంలో కృష్ణభగవాన్, అలీ, ఏవీఎస్, సునీల్, ఎం.ఎస్. చంద్రమోహన్, చలపతిరావు, సఖి, రాజి, రజిత, తెలంగాణా శకుంతల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా... విజయ్ సి. కుమార్, సంగీతం... ఎం.ఎం. శ్రీలేఖ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత... ఎ. శేఖర్, సమర్పణ... మాస్టర్ బి. అభిషేక్.
About Writer
Selvi