90 శాతం పూర్తయిన "మొండి మొగుళ్ళు-పెంకి పెళ్ళాలు"
|
ఇంకా ఈ సినిమా విశేషాలను గురించి నిర్మాత మాట్లాడుతూ... తారాగణమంతా పాల్గొనగా, "జాబిల్లికి మా ఇంట షష్టిపూర్తి రోజంట" అనే పాటను చిత్రించామని, ఈ సినిమా పూర్తి వినోదభరితమైన ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా మిళితమై తెరకెక్కనుందని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య ఉండే అపోహలే అయినా హాయిగా నవ్వుకునేట్లుగా కథను తయారు చేశామని, ఇప్పటివరకు 90 శాతం షూటింగ్ పూర్తయిందని, మిగిలిన పాటలను బ్యాంకాక్, సింగపూర్‌లలో చేయాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో వేణుమాధవ్, ఎం.ఎస్. నారాయణ, జీవా, బాబూ మోహన్, గిరిబాబు, శ్రీనివాసరెడ్డి, మధువన్, సుభాషిణి, గీతా సింగ్, శీతల్, రాఖీ, బాబిలోనియా తదితరులు నటిస్తున్నారు. కెమెరా... కళ్యాణ్ సమి, సంగీతం... సిద్ధు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం... రమణారావు.