1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

త్రిష మేనేజర్ కొత్త సినిమాలో సిద్ధార్థ్!

వినోదం వెండితెర కథనాలు  అందాల ముద్దుగుమ్మ త్రిష యూత్ హీరో సిద్ధార్థ్ త్రిష మేనేజర్ కొత్త సినిమా
WD
అందాల ముద్దుగుమ్మ త్రిషతో "నువ్వొస్తానంటే... నేనొద్దంటానా..?" సినిమాలో జతకట్టిన యూత్ హీరో సిద్ధార్థ్, ఆమె మేనేజర్ నాజర్ నిర్మాణ సారథ్యం వహించే కొత్త సినిమాలో నటించబోతున్నాడట!. ఇంకేముంది... త్రిషతో నటించిన సినిమాలు హిట్‌కొట్టడం ఓ వంతు అదృష్టమైతే... ఇంకా ఆమె మేనేజర్ నిర్మించే కొత్త సినిమాలో నటిస్తే అదే లక్ కొడుతుందేమోనని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.

బొమ్మరిల్లు, ఆట వంటి చిత్రాలతో హిట్ సాధించిన ఈ బాయ్స్ హీరో... టాలీవుడ్‌లో తన హవాను కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగానే నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాణ సారథ్యంలో కొత్త సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన అందాల భామ తమన్నా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ డైరక్టర్ కోడీ రామకృష్ణ వద్ద పనిచేసిన, త్రిష మేనేజర్‌ నాజర్ నిర్మాణ సారథ్యంలో సిద్ధార్థ్ నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. మరీ ఈ సినిమా ద్వారా సిద్ధార్థ్ ఖాతాలో మరో హిట్ చేరుతుందో? లేదో? వేచి చూడాల్సిందే.
About Writer
Selvi