నాగ్-కృష్ణవంశీ కాంబినేషన్లో కొత్త చిత్రం!
Publish: Thu, 4 Sep 2008 (16:11 IST)
Updated: Thu, 4 Sep 2008 (16:09 IST)
మాస్ హీరో, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, కృష్ణవంశీ కాంబినేషన్లో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. కూల్ ఫ్యామిలి హిట్ "నిన్నే పెళ్ళాడుతా..!", చంద్రలేఖ వంటి సినిమాలతో హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ మరో కొత్త సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాకు సీనియర్ ప్రొడ్యూసర్ నిర్మాణ సారథ్యం వహించనున్నారు. ఇంకా ఈ చిత్రం పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే... కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం నాగార్జున "కింగ్" సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. బిల్లాగా ప్రభాస్ :కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అజిత్ "బిల్లా" సినిమా తెలుగులోకి రీమేక్ అవుతోంది. తెలుగు బిల్లాలో యూత్ హీరో ప్రభాస్-మెహర్ రమేష్ కాంబినేషన్ మళ్ళీ తెరకెక్కనుంది.
మాజీ కేంద్ర మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు చేతుల మీదుగా అక్టోబర్ 9వ తేదీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ప్రభాస్ యూత్‌ఫుల్, స్టైలిష్ హీరోగా కన్పించనున్నారు.