1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నేనింతే... ముమైత్‌తో పాటపాడతా!

వినోదం వెండితెర కథనాలు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ నేనింతే
WD
"ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం", "ఇడియట్", "అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి" చిత్రాలతో హీరో రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్‌లది హిట్ కాంబినేషన్‌గా ముద్ర పడింది. ఇదే కలయికలో "నేనింతే" అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. "దేశముదురు", "దుబాయ్ శ్రీను" వంటి సక్సెస్ చిత్రాలు అందించిన యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఒక పాట, రెండు ఫైట్స్‌తో పాటు 40 శాతం టాకీని పూర్తి చేసుకుందని దర్శకులు వెల్లడించారు.

ఈ నెల 16 నుంచి ముమైత్ ఖాన్‌పై ఓ పాటను చిత్రీకరిస్తామన్నారు. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. సాయిరామ్ శంకర్, సుప్రీత్ రెడ్డి, సుబ్బరాజు, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, వేణుమాధవ్, రాజా రవీంద్ర, రాజేష్, సయాజి షిండే, ఉత్తేజ్, కృష్ణభగవాన్, రమాప్రభ, కోవైసరళ, సురేఖావాణి తదితరులు నటిస్తున్నారు.
WD

ఇంకా ఈ సినిమాకు సంగీతం... చక్రి, సినిమాటోగ్రఫీ, శ్యామ్ కె. నాయుడు, ఎడిటింగ్... ఎం.ఆర్. వర్మ, ఆర్ట్... చిన్నా, ఫైట్స్... రామ్ లక్ష్మణ్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం... పూరీ జగన్నాథ్.
About Writer
Selvi