గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » సస్పెన్స్ థ్రిల్లర్‌గా "అనగనగా ఒక అరణ్యం"
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
కౌశల్, సైరాభాను, ఏక్తాత్రివేది, శ్రీరేఖ హీరోహీరోయిన్లుగా.. జి.శేఖర్ చంద్ర దర్శకత్వంలో టి. సుల్తాన్ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం "అనగనగా ఒక అరణ్యం". హిందీలో "హమ్ ఆప్‌కే సాథ్ హై" పేరుతో రూపొందుతోంది. తెలుగులో ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ... మొదటి షెడ్యూల్ ఏడు రోజుల పాటు రామోజీ ఫిలిం సిటిలో చిత్రీకరించామని, 40శాతం టాకీ పూర్తందని అన్నారు.

ఈ సినిమా వైవిధ్యభరిత యాక్షన్ మూవీగా తెరకెక్కనుందని హీరో కౌశల్ తెలిపారు. లవ్ ట్రాక్ చక్కగా వచ్చిందని సైరాభాను తెలిపారు. దర్శకుడు జి. శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. రెండో షెడ్యూల్ ఈ నెల 19 నుంచి కడప జిల్లాలోని దట్టమైన అడవుల్లో తీయనున్నట్లు తెలిపారు. క్లైమాక్స్‌ను ముంబైలో షూట్ చేస్తామని, ఇందులో విలన్‌గా ఫిరోజ్ నటిస్తున్నారని వెల్లడించారు.

వినోద్, అలేఖ్య, శ్రీకాంత్, అక్షయ, చందు, పూర్ణిమ, ప్రసూన, ఆశ తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి కథ... టి. సుల్తాన్, మాటలు... ఎస్. చిరంజీవి, పాటలు... టి.ఎస్, పి.ఎస్ వర్మ, సంగీతం... టి.ఎస్, కెమెరా... పి. సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్... రాంబాబు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు కౌశల్ సైరాభాను ఏక్తాత్రివేది శ్రీరేఖ హీరోహీరోయిన్లు సస్పెన్స్ థ్రిల్లర్ అనగనగా ఒక అరణ్యం