1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సుధ తనయుడు హీరోగా "మమత"

వినోదం వెండితెర కథనాలు ప్రేమ జంట విషయం కుటుంబ సభ్యులు సందీప్ రూప శుభాపూజ
WD
ప్రేమ జంట విషయంలో కుటుంబ సభ్యులు సరైన దిశగా ఆలోచించని పక్షంలో, ఆ జంట తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి.? వాటి వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు చుట్టూ కథ తిరుగుతుందని దర్శకుడు నరేన్ చెబుతున్నారు. ప్రముఖ క్యారెక్టర్ నటి సుధ తనయుడు సందీప్, రూప, శుభాపూజ హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రానికి "మమత" అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

అన్నై భవాని క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ డి.కె.కేశవరావు, కె. భారత్ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ... మలయాళ చిత్రసీమలో సీనియర్ నటుడు మధు హీరో తాతగా నటిస్తున్నారని, హీరో తల్లిదండ్రులుగా భానుప్రియ, శరత్‌బాబు నటిస్తుండగా, చరణ్‌రాజు కూతురుగా హీరోయిన్ రూప నటిస్తోందని చెప్పారు.

తిరుపతి, తలకోన, కేరళలో షూటింగ్ పూర్తి చేసుకుందని, ఈ నెలలో ఆడియోను, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రేమకథా చిత్రాలతో నవ్యత చోటుచేసుకుంటే ప్రేక్షాకాదరణకు నోచుకుంటుందన్న నమ్మకం ఉందని, ఆ దిశగానే ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని వెల్లడించారు.

రెండు తరాల మధ్య "ప్రేమ" వల్ల ఏర్పడిన సంఘటనల సమాహారమే ఈ చిత్రమని దర్శకుడు చెప్పారు. కళ్యాణి, పల్లవి, చార్లి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు... కృష్ణతేజ, కెమెరా... అరుణ్‌దాస్, సంగీతం... కార్తీక్ రాజ.
About Writer
Selvi