గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » "జై చిరంజీవ"తో పెంపు- "ప్రజారాజ్యం"తో దింపు!
కథనాలు
Feedback Print Bookmark and Share
 
సినిమా విడుదలయ్యాక తొలి రెండు వారాల పాటు టిక్కెట్ ధర పెంపును రద్దు చేయడం పట్ల చిన్న నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా 170 జీవోతో చిన్న నిర్మాతలకు లాభం చేకూర్చిందని వారు పేర్కొన్నారు. ఆనాడు "జై చిరంజీవ" చిత్రంతో చిరంజీవి, అశ్వనీదత్, దాసరి నారాయణ వంటి ప్రముఖులు సీఎంను తప్పుదోవ పట్టించారని చిన్న నిర్మాతలు విమర్శించారు.

చిరంజీవి పట్టుపట్టి పెంచిన టిక్కెట్ ధరకు, నేడు "ప్రజారాజ్యం" ఆవిర్భావానికి.. రాష్ట్ర ప్రభుత్వం టిక్కెట్ ధర పెంపును తొలగించడం యాదృశ్చికమైనా చిరంజీవికి ఇది తొలి అపజయంగా వారు పేర్కొన్నారు. చిత్రరంగంలో ఉండి ఎప్పుడూ కార్మిక సమస్యలను పరిష్కరించని మెగాస్టార్ రేపు ప్రజలకు ఏం సేవచేస్తారని? చిన్న నిర్మాతలు ఎద్దేవా చేశారు.

ఇక వివరాల్లోకి వెళితే.. పలువురు అగ్రనిర్మాతలు, దర్శకులు, హీరోలు సినిమా విడుదలయ్యాక తొలి రెండు వారాల్లో టిక్కెట్ ధర పెంపు అవసరమని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అందుకు ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 175 జీవోను విడుదల చేసింది. కానీ ఈ జీవోవల్ల భారీ చిత్రాలు నిర్మించే 2 శాతం మంది నిర్మాతలకే లాభిస్తుందని, మిగిలిన 98శాతం నిర్మాతలకు భారమవుతుందని అప్పట్లోనే చిన్న నిర్మాతల సంఘం పేరిట తాను చేపట్టిన నిరాహారదీక్ష గురించి ఒక్కసారి నట్టి కుమార్ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఫిలింఛాంబర్‌కు, నిర్మాతల మండలికి విజ్ఞప్తి చేశారు.

నిజాలు తెలీయకుండా అప్పట్లో సీఎంను కూడా కొంతమంది తప్పుదోవ పట్టించారని చిన్న నిర్మాతలు ఆరోపించారు. మంగళవారం నాడు ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనట్టికుమార్ మాట్లాడారు. భారీ చిత్రాలు 100 నుంచి 400 ప్రింట్లతో థియేటర్లను కబ్జాచేస్తున్నాయని, చిన్న చిత్రాలకే థియేటరే కరువయిందని ఆనాడే తాము చెప్పామని, ప్రస్తుతం మా ముందు మరికొన్ని సమస్యలున్నాయని అన్నారు.

ఇందులో ముఖ్యంగా 35 ప్రింట్ల వరకు రిలీజ్ చేసిన చిత్రాలకు పన్ను రాయితీ కల్పించాల్సిన అవసరముందని, ఈ విషయంపై త్వరలో ఛాంబర్, కౌన్సిల్‌కు మెమోరాండం సమర్పిస్తున్నామని చెప్పారు. ఈ సమస్య కూడా ముఖ్యమంత్రిగాను సానుకూలంగా పరిష్కరిస్తానని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

దాసరి నారాయణే తప్పును ఒప్పుకున్నారు: తమ్మారెడ్డి
దర్శకరత్న దాసరి నారాయణరావు తాను ఆనాడు చేసింది తప్పని ఈనాడు అంగీకరించిన నేపథ్యంలో, తానెంత నిమిత్తమాత్రుడని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. పైరసీని నియంత్రించడానికి ఆనాడు తమ్మారెడ్డి భరద్వాజకూడా రెండు వారాల టిక్కెట్ల పెంపు అవసరమని చెప్పారు.

కానీ ఈనాడు మాట మార్చి పెంపు రద్దుపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారే, ఇదేమని అడిగితే... ఎప్పటికప్పుడు సర్దుకోవడం కోసమే అలా చెబుతుంటామని, మనిషి తప్పులు చేయడం సహజమేనని, వాటిని సరిదిద్దుకోవడం ఉత్తమమని బదులిచ్చారు.

జీవోలు ఎన్ని మారినా నిర్మాత అనేవాడు మంచి చిత్రాలు తీస్తేనే మనుగడ ఉంటుందని నిర్మాతల మండవి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయం వ్యక్తం చేశారు.

రెండు వారాల టిక్కెట్ల పెంపు రద్దుపై ఆయన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పెంపు నిర్ణయం వల్ల ఇండస్ట్రీ చాలా నష్టపోయిందంటూ... రెండు వారాల కలెక్షన్లు చూసుకుని గొప్పగా భావించి పారితోషికాలు పెంచారనీ, వాటి వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని వివరించారు. పెంపు రద్దువల్ల ఎగ్జిబిటర్లకు నష్టంకంటే లాభమే ఉంటుందన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు సినిమా రెండు వారాల పాటు టిక్కెట్ ధర పెంపు రద్దు చిన్న నిర్మాతలు హర్షం