1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

12న చింతకాయల రవి ఆడియో

వినోదం వెండితెర కథనాలు విక్టరీ వెంకటేష్ అనుష్క మమతా మోహన్దాస్ హీరోహీరోయిన్లు చింతకాయల రవి ఆడియో
WD
విక్టరీ వెంకటేష్, అనుష్క, మమతా మోహన్‌దాస్ హీరోహీరోయిన్లుగానటిస్తోన్న "చింతకాయల రవి" ఆడియో ఈ నెల 12వ తేదీన మార్కెట్లోకి విడుదల కానుంది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై 'ఒక రాజు ఒక రాణి" ఫేమ్ యోగి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ పాత్రను పోషిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా వెంకీ గెటప్ స్టైలిష్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. రామానాయుడు స్టూడియోలో విదేశీ లొకేషన్లకు ఏర్పాటు చేసిన సెట్‌లో ప్రస్తుతం చింతకాయల రవి షూటింగ్ జరుపుకుంటున్నాడు.

అనుష్క, పలువురు డ్యాన్సర్లపై చిత్రీకరణ జరుగుతోంది. "ఓం శాంతి ఓం" ఫేం సంగీత దర్శకుడు విశాల్ శేఖర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నారు. ఇకపోతే.. ఆదిత్య మ్యూజిక్ ద్వారా చింతకాయల రవి ఆడియో మార్కెట్లోకి విడుదల కానుంది.
About Writer
Selvi