1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"కింగ్‌"లో మమతా సాంగ్..!

వినోదం వెండితెర కథనాలు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తాజా చిత్రం కింగ్ మమతా మోహన్ దాస్
WD
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తాజా చిత్రం "కింగ్"లో అందాల ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్ ఓ సాంగ్‌ను ఆలపించనుంది. ఇప్పటికే టాకీతో పాటు ఓ సాంగ్, రెండు ఫైట్లు "కింగ్" పూర్తి చేసుకున్నాడని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇకపోతే "కింగ్"లో నాగ్ సరసన త్రిష నటిస్తుండగా, మరో కథానాయిక పాత్రను మమతా మోహన్ దాస్ పోషిస్తోంది.

ఇప్పటికి వరకు టాలీవుడ్‌లో గాయనిగానూ, హీరోయిన్‌గానూ మమతా మోహన్ దాస్ తన హవాను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే . ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న "కింగ్" సినిమా తదుపరి షెడ్యూల్‌... ఈ నెల (సెప్టెంబర్) 28 నుంచి గోవాలో ప్రారంభం కానుంది.

గోవాలో ఒక ఛేంజ్, ఒక పాటను షూటింగ్‌కు, అనంతరం అక్టోబర్ 6 నుంచి బెంగుళూరు ప్యాలెస్‌లో షూటింగ్ జరుగుతుంది. నవంబర్‌లో రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నారు. డిసెంబర్ 5 వరకు సినిమా షూటింగ్ జరుగుతుందని నిర్మాత తెలిపారు. ముందుగా ప్రకటించినట్టుగా డిసెంబర్ 18న సినిమాను తప్పకుండా విడుదల చేస్తామన్నారు.
About Writer
Selvi