1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

హీరోయిన్‌గా తెరపైకి బేబీ షామిలీ!

వినోదం వెండితెర కథనాలు టాలీవుడ్ అంజలి బాలనటి హీరోయిన్ పరిచయం
టాలీవుడ్‌కు "అంజలి" సినిమా ద్వారా బాలనటిగా పరిచయమైన బేబీ షామిలీ హీరోయిన్‌గా పరిచయం కానుంది. బాయ్స్, "నువ్వస్తానంటే.. నేనొద్దంటానా..." వంటి హిట్ సినిమాల్లో నటించిన చాక్లెట్ బాయ్ సిద్ధార్థ్ సరసన బేబీ షామిలీ హీరోయిన్‌గా నటించనుందట.!.

ఈ సినిమాకు ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. యూనివర్సల్ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈ సినిమా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సెట్‌పైకి వస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఇదిలా ఉండగా, బేబీ షామిలీ సోదరి షాలిని కోలీవుడ్‌, టాలీవుడ్‌‌లలో బాలనటిగా ప్రవేశించి హీరోయిన్‌గా స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్‌ను షాలిని వివాహం చేసుకున్న సంగతి విదితమే.
About Writer
Selvi