కోలీవుడ్‌లో "విక్రమార్కుడు"
|
కోలీవుడ్‌లో "ఆయిరత్తిల్ ఒరువన్" అనే పేరిట విక్రమార్కుడు తెరకెక్కనున్నాడు. స్టూడియో గ్రీన్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇకపోతే కార్తీక్ ప్రస్తుతం "పడిక్కాదవన్" అనే కొత్త సినిమాలో డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇంకా... ఈ సినిమా టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమాలో కార్తీక్ సరసన "పరుత్తివీరన్" హీరోయిన్ ప్రియామణి, అందాలభామ అనుష్కలు నటిస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో తన హవాను కొనసాగిస్తున్న అనుష్క కోలీవుడ్‌లో మాధవన్ సరసన "ఇరండు" (రెండు) అనే సినిమాలో నటించింది.