"స్నేహగీతం" పాడేది వీరే...!
|
గతకొద్దినెలలుగా ఈ చిత్రం కోసం నెట్‌లో సెర్చ్‌చేయగా 2వేల అప్లికేషన్లు వచ్చాయి. అందులో ముగ్గురు హీరోలను, ఓ హీరోయిన్‌ను ఎంపికచేశారు. ఇంకా ఇద్దరు హీరోయిన్లను ఎంపికచేయాల్సి ఉంది. అంతా తెలుగు వచ్చిన వారినే ఎంపికచేస్తున్నామని కూకట్‌పల్లి కళామందిర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో హీరోలుగా పరిచయం అవుతున్న సందీప్, వెంకీ, చైతన్యలతో పాటు హీరోయిన్ శ్రేయ ధన్వంతరిని దర్శకుడు శ్రీధర్ పరిచయం చేశారు.
వీరిలో ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కాగా, మరొకరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ప్రస్తుతం యువత చాలామంది ఏదో రకంగా తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని తహతహలాడుతున్నారని, అలా వచ్చిన వారే ఈ నలుగురని శ్రీధర్ చెప్పారు. ఈ కార్యక్రమానికి "దిల్" రాజు కూడా హాజరయ్యారు.
చక్కని ఉద్యోగాలను వదిలి ఈ రంగంలోకి వచ్చిన మీరు శ్రమించి సక్సెస్ సాధించాలని, అలా చేస్తే తాను నిర్మించబోయే తదుపరి చిత్రంలో మీకు అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ చిత్రం షూటింగ్ వచ్చేనెలలో ఉండవచ్చునని నిర్మాత లగడపాటి శ్రీధర్ తెలిపారు.