1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కళాశాల జీవితమే "కొత్తబంగారులోకం"

వినోదం వెండితెర కథనాలు దిల్ రాజు  నిర్మాణ సారథ్యం శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కొత్తబంగారులోకం వరుణ్ సందేశ్ శ్వేత ప్రసాద్ కళాశాల జీవితం
WD
"దిల్" రాజు నిర్మాణ సారథ్యంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం "కొత్తబంగారులోకం". ఈ చిత్రానికి "వెయిటింగ్ ఫర్ యు" అనే ట్యాగ్‌లైన్ కూడా జతచేశారు. "హ్యాపీడేస్" ఫేం వరుణ్ సందేశ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, శ్వేత ప్రసాద్ కథానాయికగా పరిచయమవుతోంది.

పోస్ట్‌ప్రొడక్షన్స్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నామని నిర్మాత దిల్ రాజ్ చెప్పారు. ఇటీవలే విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోందని, దీంతో సగం చిత్రం సక్సెస్ సాధించినట్లుగా భావిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. కళాశాల జీవితాన్ని గుర్తుచేస్తూ దర్శకుడే రాసిన గీతం యువతను ప్రత్యేకంగా ఆకర్షిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సంగీత దర్శకుడు మిక్కీజె. మేయర్ స్వరాలకు సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం బాణీలకు వన్నె తెచ్చిందన్నారు.

మొదట దర్శకుడిని దూరంగా ఉంచానని, వి. వి. వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై శ్రీకాంత్ రాసిన కవిత తనకు నచ్చిందని, దీంతో అతను తన దృష్టిలో పడ్డాడని "దిల్" రాజు చెప్పారు.

తనకిచ్చిన అవకాశం సద్వినియోదం చేసుకున్నానని శ్రీకాంత్ చెప్పారు. చిత్రానికి అద్భుతమైన పాటలు అందించిన సాహితీ వేత్తలు, సంగీత దర్శకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, రజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా.. చోటా కె. నాయుడు.
About Writer
Selvi