"దొంగలబండి" ఎంతవరకొచ్చింది..?!
|
ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ... ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిందని, అనుకున్నట్లుగానే సినిమాను సతీష్ చక్కగా తెరకెక్కించారని అన్నారు. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
నరేష్ మాట్లాడుతూ... 24మంది కమేడియన్స్ నిధికోసం వేటకెళ్ళే కథాంశంతో... అంతా ఔట్‌డోర్‌లోనే షూటింగ్ జరిగిందని, సతీష్ తాను నటించిన ఐదు చిత్రాలకు రచయితగా పనిచేశాడని, అన్నీ విజయవంతమయ్యాయని తెలిపారు. ఆ కోవలోనే "దొంగలబండి" సినిమా కూడా తెరకెక్కనుందని, విజువల్ కామెడీగా ఈ చిత్రముంటుందని చెప్పారు. ఆ దొంగల్లో తాను ఒకడని, సీమశాస్త్రి కంటే వైవిధ్యంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... ఇంతమంది కమేడియన్స్‌ను ఎలా మేనేజ్ చేస్తావ్? అని చాలామంది అడిగారని, అందరి సహకారంతో అనుకున్నట్లుగానే చిత్రీకరించానన్నారు. ఈ సినిమా షూటింగ్ పిక్నిక్‌లా సరదాగా సాగిందని, నిధికోసం చేసిన వేట సీరియస్‌గా కాకుండా కామెడీగా ఉంటుందన్నారు.
సంగీత దర్శకుడు రాజశేఖర్ వల్లూరి మాట్లాడుతూ... ఇందులో ఐదు పాటలున్నాయని, కూచిపూడి వెంకట్ దర్శకత్వంలోని "మొదటి సినిమా" తాను చేసిన తొలిసినిమా అని, ఆ తర్వాత చేస్తున్న సినిమా ఇదేనని, దీని తర్వాత "సమర్థుడు" అనే యాక్షన్ మూవీకి సంగీతం సమకూరుస్తున్నానని వెల్లడించారు. తొలిదశలోనే లవ్, కామెడీ, యాక్షన్ చిత్రాలకు పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఇంకా ఈ చిత్రంలో.. బ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్. వేణుమాధవ్, కృష్ణభగవాన్, రావురమేష్, గుండు, మేల్కొటే, సుమన్ శెట్టి, కోవైసరళ తదితరులు నటించారు. పాలు... సుద్దాల, అభినయ శ్రీనివాస్, నూరిశెట్టి రామారావు, కెమెరా... అరుణ్‌కుమార్, ఎడిటింగ్... నందమూరి హరి, ఆర్ట్.. రమణ, ప్రొడక్షన్ మేనేజర్... సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. నరేష్ ఉత్తరాది, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం... వేగేశ్న సతీష్.