"యు" సర్టిఫికేట్ పొందిన "మల్లెపువ్వు"
|
ఈ సినిమాలోని ఏ ఒక్క సన్నివేశాన్ని కూడా కట్ చేయకుండా పూర్తి సినిమాను విడుదల చేసేందుకు బోర్డు అంగీకరించింది. ఈ నెల 19న తెరపైకి రానున్న ఈ సినిమాలో భూమిక విభిన్న పాత్రను పోషిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం సమకూర్చడం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని, "మల్లెపువ్వు" కూడా ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు వి. సముద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.
చక్కని లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని సముద్ర తెలిపారు. భూమిక కెరీర్‌లో "మల్లెపువ్వు" మంచి సినిమా అవుతుందని అన్నారు. హీరోగా పరిచయం అవుతున్న మురళీ కృష్ణ పాత్రకు చక్కగా అమరారని తెలిపారు. ఇంకా ఈ సినిమాకు పాటలు... వేటూరి, కథ.. రమేష్ వర్మ, ఛాయాగ్రహణం... అనిల్ భండారి.