1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సెప్టెంబర్ 20న తేజ "కేక" ఆడియో విడుదల

వినోదం వెండితెర కథనాలు చిత్రం సెప్టెంబర్ 20 కేక ఆడియో విడుదల తేజ కేక
WD
"చిత్రం" సినిమా హిట్‌తో టాలీవుడ్‌‌ను కుదిపేసిన ప్రముఖ దర్శకుడు తేజ "కేక" సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఉదయ్ కిరణ్ హీరోగా, రీమాసేన్ హీరోయిన్‌గా నటించిన "చిత్రం" సినిమా తర్వాత తేజ... "లక్ష్మీ కళ్యాణం" ద్వారా తెరపైకి వచ్చారు. అయితే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "లక్ష్మీ కళ్యాణం" బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.

దీనితో మెల్లమెల్లగా అడుగులేస్తున్న తేజ "కేక" సినిమాను భారీ అంచనాలతో రూపొందిస్తున్నారు. దాదాపు 36 మంది కొత్త ఆర్టిస్టులతో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. చిత్రం మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న "కేక" సినిమాకు చక్రి సంగీతం సమకూర్చారు. పి.సి. శ్రీరామ్ కెమెరా పనితనం "కేక" సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల్లో టాక్.

ఇకపోతే ఈ సినిమా ఆడియోను ఈ నెల 20వ తేదీన మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అదే విధంగా వచ్చే నెల (అక్టోబర్) 1వ తేదీన "కేక" సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని యూనిట్ తెలిపింది.
About Writer
Selvi