గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » "చిరంజీవి"గా ఏవీఎస్!
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
అనారోగ్యం నుంచి బయటపడిన హాస్యతార ఏవీఎస్. తాను ఆరోగ్యవంతునిగా ఉన్నానని, మళ్ళీ నటనవైపు దృష్టిసారిస్తానని ఏవీఎస్ తెలిపిన విషయం తెలిసిందే. తొలిసారిగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో "అ...ఆ...ఇ...ఈ" చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర పేరు చిరంజీవి. మృత్యుంజయునిగా వచ్చాడు కాబట్టి చిరంజీవి అనే పేరు దర్శకుడు పెట్టారు.

ఇందులో ఆయన సి.బి.ఐ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈయన అసిస్టెంట్‌గా సునీల్ నటిస్తున్నారు. ఏవీఎస్ వరసకు మేనల్లుడు పాత్రలో సునీల్ నటిస్తున్న నేపథ్యంలో, వీరి కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలను గురువారం నాడు రాక్ కాజిల్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఏవీఎస్‌కు ఆత్మీయ అభినందనలు తెలియజేసింది.

తాను దర్శకత్వం వహించిన "కుబేరులు" సినిమాకు డబ్బింగ్ చెప్పాక చికిత్సకోసం ఆస్పత్రికి వెళ్ళారని, మళ్ళీ మీరు పూర్తి ఆరోగ్యంతో తన చిత్రంలో చేస్తారని ఆనాడే చెప్పానని గుర్తు చేసుకున్నారు. అనుకున్నట్లుగా ఆయన కోలుకుని రావడం, తొలిసారిగా "అ..ఆ...ఇ...ఈ"లో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నానని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

చిత్రం గురించి మాట్లాడుతూ... గతనెల 8 నుంచి షెడ్యూల్‌ను ప్రారంభించామని, వచ్చేనెల 20 నాటికి చిత్రాన్ని పూర్తిచేస్తామని, నవంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. "అభ్యాసంగా" "అ..ఆ...ఇ...ఈ.." నేర్చుకుని తర్వాత వర్ణమాలలు, ఛందస్సులతో మరింత పరిపుష్టంగా ఏవీఎస్ ఎదగాలని నటుడు ఉత్తేజ్ అభివర్ణించారు.

నటుడు సునీల్ వ్యాఖ్యానిస్తూ... క్రికెట్‌లో సిక్స్ కొట్టిన బంతిని బౌండరీలో ప్లేయర్ పడతాడా... వదిలేస్తాడా.. అనే టెన్షన్‌లో ఉంటాం. వదిలితే.. ఆ బ్యాట్స్‌మెన్ విజృంభించి 175 వరకు కొడతాడు. సరిగ్గా ఏవీఎస్ పరిస్థితి అంతే. తిరిగి ఆరోగ్యంతో కోలుకున్న ఆయన మళ్ళీ నటునిగా విజృంభించాలని ఆశిస్తున్నానన్నారు.

తన పాత్ర గురించి వెల్లడిస్తూ... జేమ్స్‌బాండ్ ఇన్‌స్పిరేషన్‌తో అలా ఉండాలనుకునే జేమ్స్‌బాండ్ పాత్ర పోషిస్తున్నానని అన్నారు. కానీ చివరికి జేమ్స్‌బాండ్ కాదు... జేమ్స్‌బాండ్ లాంటి వాడని అందరూ అనుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. చాలా కామెడీతో దర్శకుడు పాత్రను మలిచారని, ఈ పాత్ర అందరిని అలరిస్తుందనే అనుకుంటున్నానని వెల్లడించారు.

ఏవీఎస్ స్పందిస్తూ... తొలిసినిమాలో పడ్డ టెన్షన్‌ను, మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత ఈ రోజు పడ్డానని, షూటింగ్‌కు బయలుదేరేటప్పుడే ఫస్ట్ షాట్ ఓకే చేయగలనా? అనే సందేహం కల్గిందని చెబుతూ.. ఇదే రాజ్ కాజిల్‌లో "కుబేరులు" ఆగస్టు 18 గురువారం నాడు షూటింగ్ చేశానని చెప్పారు. మళ్ళీ నెలవేరైనా గురువారం 18న ఇదే దర్ళకుడి చిత్రంలో నటించడం యాదృశ్చికమైనా శుభసూచికంగా ఫీలవుతున్నానని వెల్లడించారు. చాలామంది తనను విశ్రాంతి తీసుకోవచ్చు కదానని సూచనలిస్తున్నారని, కానీ తనకు ఈ వృత్తిలోనే రిలాక్స్ వస్తుందని భావించి సినిమాలు చేస్తున్నానని బదులిచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు చిరంజీవి ఏవీఎస్ శ్రీనివాస రెడ్డి దర్శకత్వం అఆఇఈ