రమేష్ వర్మ "గాలిపటం"లో మురళీకృష్ణ!
|
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "అసాధ్యుడు" సినిమాకు దర్శకత్వం వహించిన రమేష్ వర్మ "గాలిపటం" సినిమాను భారీ అంచనాలతో రూపొందిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇకపోతే మురళీకృష్ణ హీరోగా, భూమిక ప్రధాన పాత్ర పోషిస్తున్న "మల్లెపువ్వు" విడుదలకు సిద్ధమైంది.
సముద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న "మల్లెపువ్వు" సినిమా మురళీకృష్ణకు మంచి గుర్తింపును సాధించిపెడుతుందని కృష్ణ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మురళీ కృష్ణ "మిత్రుడు", "తెలుసా.. మనసా...", "గాలిపటం", "మల్లెపువ్వు" అనే నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారని, అందులో "మల్లెపువ్వు" సినిమా సెప్టెంబర్ 19న (శుక్రవారం) విడుదల కానుంది. ఇప్పటికే "మల్లెపువ్వు" సినిమాకు సెన్సార్ బోర్డు పచ్చజెండా ఊపుతూ.. "యు" సర్టిఫికేట్‌ను ఓకే చేసింది.