శశాంక్ కొత్త చిత్రం "వారధి"
|
ప్రతిభ ఉంటేనే సరిపోదని, అందుకు తగిన ప్రోత్సాహం తోడైతే ఏదైనా సాధించవచ్చనే అంశానికి... ప్రేమకథను జోడించి వినోదాత్మకంగా మలిచామని దర్శకుడు శ్రీకాంత్ భల్లా చెప్పారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన మూడు పాటలను మలేషియాలో చిత్రీకరించామని, దీనితో ఈ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తిచేసుకుందని ఆయన తెలిపారు.
ఇంకా ఈ చిత్రంలో రంగనాథ్, గాయత్రి, ఎం.ఎస్. నారాయణ, అలీ, అన్నపూర్ణ, దువ్వాసి మోహన్, మేల్కొటి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం.. మోహన్ సితార.