1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

టాలీవుడ్‌లో "ప్రియామణి" హవా!

వినోదం వెండితెర కథనాలు కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ పరుత్తివీరన్ ప్రియామణి టాలీవుడ్ అవకాశాలు వెల్లువ
కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ "పరుత్తివీరన్" సినిమాకు జాతీయ అవార్డును అందుకున్న అందాల భామ ప్రియామణి టాలీవుడ్‌లోనూ తన హవాను కొనసాగిస్తోంది. "హరేరామ్" సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నటించిన ప్రియామణికి టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

తాజాగా సాంబశివ క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న కొత్త చిత్రంలో ప్రియామణి నటిస్తోందట. ఈ సినిమాకు రవిచంద్ నిర్మాణ సారథ్యం వహించగా, గోవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. శివ, సీతారాముడు వంటి హిట్ చిత్రాలను అందించిన యలమంచి రవిచంద్ ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో చిత్రీకరించనున్నారు.

ఈ సందర్భంగా రవిచంద్ మాట్లాడుతూ... "మాయగాడు" పేరుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో వేణు, ఛార్మీలు హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రియామణి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. గోవర్ధన్ రాసిన కథ వేణు, ఛార్మీ, ప్రియామణిలకు చాలా బాగా నచ్చిందని రవిచంద్ వెల్లడించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. ఇంకా ఈ చిత్రానికి సంగీతం... చక్రి, సినిమాటోగ్రఫీ... వాసు.
About Writer
Selvi