1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

తలకోనలో "జగన్మోహిని"

వినోదం వెండితెర కథనాలు జానపద బ్రహ్మ విఠలాచార్య జగన్మోహిని రాజా నమిత మీరాచోప్రా
WD
జానపద బ్రహ్మ విఠలాచార్య సృష్టించిన "జగన్మోహిని" చిత్రం అదే పేరుతో రీమేక్ కాబోతుంది. రాజా, నమిత, మీరాచోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మురళీ సినీ ఆర్ట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటుంది. ఎన్.కె.విశ్వనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్. మురళి నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ... తొలిసారి జానపద చిత్రంలో నటిస్తున్నానని, యువరాజుగా కన్పిస్తానని తెలిపారు. తన కెరీర్‌లో ఒక వైవిధ్యమైన చిత్రంలా నిలుస్తుందని, గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యమున్న చిత్రమిదని తెలిపారు.

నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ... ప్రస్తుతం తలకోన, పుత్తూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోందన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని వెల్లడించారు. ఈ షూటింగ్‌లో భాగంగా రాజా, నమిత, మీరా చోప్రాలపై ఓ పాటను చిత్రిస్తున్నామన్నారు. ఇంకా ఈ చిత్రానికి కథ... పుగళ్ మణి, రచన.. వెన్నెల కంటి.
About Writer
Selvi