పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో "జంక్షన్"
|
ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా... "జంక్షన్" చుట్టూ తిరుగుతుందని చెప్పారు. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టామని, రవీంద్రనాథ్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా పరుచూరి బ్రదర్స్ బలమైన కథను అందించారని వివరించారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈ నెలాఖరున ఆడియోను, వచ్చేనెల సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు నిర్మాత తెలిపారు.
ఈ సినిమాలోని పాత్రలన్నీ నేచురల్‌గా ఉంటాయని, బాలెన్స్ పాటలను చిత్రీకరించడానికి భారీ సెట్స్ వేశామని చిత్ర దర్శకుడు వెల్లడించారు. ట
ఇంకా ఈ చిత్రంలో కోటశ్రీనివాసరావు, ఆశాషైనీ, డాక్టర్ శివప్రసాద్, ఎమ్మెస్ చౌదరి, భానుచందర్, బ్రహ్మానందం, బాబూ మోహన్, అలీ, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, జయప్రకాష్ రెడ్డి, వేణుమాధవ్, ఉత్తేజ్, నర్సింగ్ యాదవ్, రఘునాధ రెడ్డి, పావలా శ్యామలా, దీపాంజలి, సుభాషిణి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు.. పరుచూరి బ్రదర్స్, సంగీతం... జాన్ సాల్మన్, కెమెరా.. వెంకట్, ఆర్.పి., ఎడిటింగ్... నందమూరి హరి.