"హాసిని"గా నటించడం అదృష్టం : జెనీలియా
"హాసిని"గా నటించడం తన అదృష్టమని అందాల ముద్దుగుమ్మ జెనీలియా చెబుతోంది. తెలుగు "బొమ్మరిల్లు"లో హాసిని పాత్ర ఎంత పేరు తెచ్చిందో, తమిళంలో కూడా అంత పేరు వచ్చిందనీ, ప్రస్తుతం హిందీలో అదే పాత్ర పోషిస్తున్నానని చెప్పింది. మూడు భాషల్లో సేమ్ పాత్ర చేయడంతో ఏమాత్రం బోర్ కొట్టలేదని, ఆ పాత్రను పోషించడం తన అదృష్టంగా భావిస్తున్నానని జెనీలియా అంటోంది.
2003లో తమిళ "బాయ్స్", తెలుగు "సత్యం", "హిందీ తుఝె మేరి కసమ్" చిత్రాల్లో లీడ్ రోల్ ప్లే చేసి హ్యాట్రిక్ విజయాలు సాధించింది. మళ్ళీ అదే ఒరవడిని కొనసాగిస్తున్న ఈ భామ ఇటీవలే హిందీ బ్లాక్ బస్టర్ మూవీ "జానే తు యా జానే న" చిత్రంలో మంచి పేరు సంపాదించింది.
"హాసిని" పాత్ర కంటే ఈ పాత్ర సంపాదించిన పేరు పెద్దది కాదని జెనీలియా చెబుతోంది. ప్రస్తుతం హిందీలో రూపుదిద్దుకుంటున్న "బొమ్మరిల్లు" సినిమాకు "ఇట్స్ మై లైఫ్" అనే పేరు పెట్టారు. ఈ చిత్రానికి బోని కపూర్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.