అవి బయటకు చెప్పేవి కావు: దాసరి
ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే దర్శకరత్న దాసరి నారాయణరావును అందరూ సంప్రదిస్తుంటారు. దాన్ని ఎలాగోలా పరిష్కరిస్తుంటారు. ఈసారి ఫైటర్స్ అసోసియేషన్ మాత్రం ఆయనకు తెలియకుండానే నిరాహారదీక్షను చేపట్టింది. దీంతో ఫైటర్స్ సహకరించకపోవడంతో కొన్ని సినిమాలు ఆగిపోయాయి.
వెంటనే ఫిలింఛాంబర్ సమావేశమై ఈ బాధ్యతను దాసరికి అప్పగించింది. ఎట్టకేలకు బుధవారం నాడు దాసరి నారాయణరావు ఫైటర్స్ నిరాహార దీక్ష చేస్తున్న టెంట్‌కు వచ్చి స్ప్రైట్ కూల్‌డ్రింక్స్ (నిమ్మరసం బదులు) ఇచ్చి దీక్ష విరమింపజేశారు. మరోవైపు ఫైటర్సంతా ఆనందం వ్యక్తం చేశారు.
ఏ హామీలను ఇచ్చారనే ప్రశ్నకు దాసరి స్పందిస్తూ... మేం ఏం చేస్తామో వారికి బాగా తెలుసునని, అవి బయటికి చెప్పేవి కావని దాటవేశారు. కొన్నింటిని అంతర్గతంగా చేయాల్సి ఉంటుందని, అయినా ఫైటర్స్ కోరినవి సమంజసమైన కోరికలే.. అంటూ ముగించారు. మరి అంతర్గత ఒప్పందాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాల్సిందే.