నితిన్ "హీరో" ఆడియో విడుదల
నితిన్, భావన హీరోహీరోయిన్లుగా, నాగబాబు, రమ్యకృష్ణ జోడీగా నటిస్తున్న చిత్రం "హీరో". ఈ సినిమా ఆడియో బుధవారం రాత్రి ఫోర్చిన్ కత్రియా హోటల్‌లో వైభవంగా విడుదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో శ్రీకాంత్ ఆడియో సీడీని ఆవిష్కరించి, తరుణ్‌కు అందజేశారు.
ఆడియో క్యాసెట్‌ను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఆవిష్కరించగా, దర్శకుడు కరుణాకరన్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందు చిత్రంలోని ఐదు పాటలను, సినీ ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సి. కళ్యాణ్ మాట్లాడుతూ... ప్రోమోస్ చూస్తుంటేనే దర్శకుని టాలెంట్ ఏమిటో అర్థమవుతుందన్నారు. అద్భుతంగా మలిచిన ఈ సినిమా, బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కథ తనకు తెలుసునని, సినిమా రంగంలో "హీరో" చిత్రం కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తుందని తెలిపారు.
కోటశ్రీనివాసరావు మాట్లాడుతూ... చిత్రంలో పనిచేసిన ప్రతిఒక్కరిని ప్రశంసిస్తూ... కథను బట్టి, ఆర్టిస్టుల ఫెర్‌ఫార్మెన్స్ అదిరిందని తెలిపారు. కెమెరామెన్ పనితనం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందన్నారు. దర్శకుడిగా జీవీ సద్వినియోగం చేసుకుని జీవం లాంటి సినిమాను తీశాడని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
తరుణ్ మాట్లాడుతూ... ట్రైలర్స్ బాగున్నాయని, "హీరో" పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ చెబుతూ... ట్రైలర్స్, సాంగ్స్‌లలో నితిన్ కొత్తగా కన్పిస్తున్నాడని, క్రికెటర్‌గా జీవీ సెంచరీ చేయకపోయినా దర్శకుడిగా సెంచరీ చేయాలని ఆకాంక్షించారు.
నితిన్ మాట్లాడుతూ... "సై" తర్వాత అంత స్టైలిష్‌గా ఉన్న చిత్రమిదని, తన బాడీ లాంగ్వేజ్, కేశాలంకరణ కొత్తగా ఉంటాయన్నారు. మొదట్లో జీవీ అనగానే విలన్‌లాగా మాస్ కథ అనుకున్నానని, కానీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కథను వినిపించారని చెప్పారు. దర్శకుడిగా చాలా హోమ్‌వర్క్ చేశానని, తాను నటించిన బేనర్‌లో కొన్ని మంచి, ఫ్లాప్ చిత్రాలున్నాయని నితిన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే మన్యం ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చే తన చిత్రం హిట్ అవడంతో పాటు, మన్యం బెస్ట్ బేనర్‌గా నిలుస్తుందని వెల్లడించారు.
నిర్మాత రమేష్ మాట్లాడుతూ... చిత్ర నిర్మాణానికి ముందు జరిగిన పూర్వాపరాలు వివరించారు. అనుకున్నట్లుగా 70 రోజుల్లో వర్షాకాలంలో ఎటువంటి అడ్డంకి లేకుండా పూర్తి చేయగలిగామని తెలిపారు.
జీవి మాట్లాడుతూ.. లాయర్ అయిన తాను నటుడిగా గుర్తింపు పొందానని, అందరిచేత "మన" జీవీగా పేరుపొందానని చెప్పారు. అదే తనను చిత్రదర్శకుడిని చేసేందుకు తోడ్పడిందని పేర్కొన్నారు. తనకిష్టమైన నటుడు కోట శ్రీనివాసరావు అని వెల్లడించారు.