యూత్ఫుల్ లవ్‌స్టోరీగా "శ్రీలక్ష్మీ ఫిలిమ్స్" కొత్త చిత్రం
|
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని చెప్పారు. యూత్ ఆలోచనలు ఎలా ఉంటాయనడంతో పాటు, ఏ వైపు వారు పయనిస్తున్నారనే అంశాలపై ఈ చిత్రంలో చర్చిస్తున్నామన్నారు. బుధవారం ప్రారంభమైన ఈ షూటింగ్ 20 రోజుల పాటు వైజాగ్, అరకులలో జరుగుతుందన్నారు.
సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిదని నిర్మాత చెప్పారు. ఈ సినిమా ద్వారా తమకు మంచి గుర్తింపు లభిస్తుందని రాహుల్, పావనిలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఈ చిత్రంలో జీవా, అనంత్, రాగిణి, కవిత, వినోద్, గౌతం రాజు, కళ్యాణి తదితరులు నటించనున్నారు. కెమెరా... బి.ఎస్. కుమార్, సంగీతం.. ప్రిన్స్ అండ్ నాని, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం... దాసరి శ్రీకాంత్.