1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

లైఫ్‌లో ఎక్సైటింగ్ బర్త్‌డే: శ్రీను వైట్ల

లైఫ్లో ఎక్సైటింగ్ బర్త్డే శ్రీను వైట్ల
"ఢీ", "దుబాయ్ శీను", "రెడీ" చిత్రాల ఘన విజయాలతో హ్యాట్రిక్ సాధించిన శ్రీను వైట్ల పుట్టినరోజు సెప్టెంబర్ 24. ఈ సందర్భంగా కామాక్షి కళా మూవీస్ నవరస సామ్రాట్ నాగార్జున "కింగ్" యూనిట్ సభ్యుల మధ్య బర్త్‌డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందుకున్నారు.

WD PhotoWD
నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి, యువ నిర్మాత చందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అక్కినేని వెంకటరత్నం, ఛాయాగ్రహకులు ప్రసాద్ మూరెళ్ళ, కింగ్ చిత్ర నిర్వాహకుడు చెంచు రెడ్డి, ప్రొడక్షన్ కంట్రోలర్ కృష్ణ వర్ధన్‌లతో పాటు యూనిట్ సభ్యులంతా శ్రీను వైట్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇందులో ముఖ్యంగా దర్శకుడు శ్రీను వైట్లను "హ్యాపీ బర్త్ డే శ్రీను హిట్ల" అని జయప్రకాష్ రెడ్డి అభినందించడం విశేషం. ఇకపోతే శ్రీను వైట్లకు "కింగ్" నాగార్జున ఫోన్‌లో బర్త్‌డే విషెస్ తెలిపారు. 24 గంటలూ సినిమా గురించే ఆలోచించే శ్రీను వైట్ల మరిన్ని ఘనవిజయాలను సాధించాలని నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ... ఇది తన లైఫ్‌లో బాగా ఎక్సైట్ చేసిన బర్త్‌డే అని అన్నారు. హ్యాట్రిక్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన బర్త్‌డే ఇదని, "రెడీ" వంద రోజులు అవుతుందని చెప్పారు.

నాగార్జున గారితో "కింగ్" లాంటి ఎక్స్‌ట్రార్డినరీ ప్రాజెక్టు చేస్తున్న టైమ్‌లో జరుపుకుంటున్న ఈ బర్త్‌డే తన లైఫ్‌లో వెరీ వెరీ హ్యాపీ బర్త్‌డేనని శ్రీను వైట్ల వెల్లడించారు. తప్పకుండా "కింగ్" అంచనాలకు అనుగుణంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
About Writer
Selvi