గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » ఊటీ, బెంగళూరులలో నాగార్జున "కింగ్"
కథనాలు
Feedback Print Bookmark and Share
 
FILE
నవరస సామ్రాట్ అక్కినేని నాగార్జున, హ్యాట్రిక్ డైరక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో కామాక్షి కళామూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి, శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న భారీ చిత్రం "కింగ్" షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది.

ఈ సందర్భంగా కింగ్ మేకర్ డి.శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తయిందన్నారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 4వరకు ఊటీలో ఓ పాట, ఓ ఛేజ్, అక్టోబర్ 5 నుంచి నవంబర్ 4వరకు బెంగళూరులో జరిగే షెడ్యూల్‌తో చిత్రంలోని ప్రధాన తారాగణం అందరూ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తామని చెప్పారు.

ఆ తర్వాత టర్కీ, దుబాయ్‌లలో పాటలను చిత్రీకరించడంతో దాదాపుగా షూటింగ్ పూర్తవుతుందని శివప్రసాద్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 18న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఇకపోతే... నవరస సామ్రాట్ నాగార్జున సరసన తొలిసారిగా గ్లామర్ స్టార్ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి ఓ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం.

దీపక్, బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, ధర్మవరపు, కృష్ణభగవాన్, చంద్రమోహన్, ఎం.ఎస్. నారాయణ, జయప్రకాష్ రెడ్డి, షాయాజీ షిండే, సుప్రీత్, బెనర్జీ, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ... కోన వెంకట్, గోపిమోహన్, మాటలు... బి.వి.ఎస్.రవి, పాటలు... సాహితి, రామజోగయ్య శాస్త్రి, సంగీతం... దేవీశ్రీ ప్రసాద్, కెమెరా... ప్రసాద్ మూరెళ్ళ.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు నాగార్జున హ్యాట్రిక్ డైరక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్ కామాక్షి కళామూవీస్ పతాకం ఊటీ, బెంగళూరు షూటింగ్ కింగ్