గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » యాక్షన్ దృశ్యాల్లో "సత్యమేవజయతే"
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
డాక్టర్ రాజశేఖర్, సంజన హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం "సత్యమేవజయతే". శ్రీమతి. జీవిత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివానీ, శివాత్మిక నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శివాజీ, నీతూచంద్ర, సాయికిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈసినిమా... పోలీసు రాజకీయ వ్యవస్థపై సరికొత్త కథతో తెరకెక్కనుంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి, దాసరి నారాయణరావులు ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్... ఏకధాటిగా రామోజీ ఫిలింసిటిలో జరుగుతోంది. ప్రస్తుతానికి టాకీతో పాటు మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. కాగా సెప్టెంబర్ 28 నుంచి యాక్షన్ దృశ్యాలను చిత్రించనున్నారు.

ఈ సందర్భంగా దర్శకులు జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన రెండు పాటలను, క్లైమాక్స్‌ను త్వరలో చిత్రిస్తామని చెప్పారు. రామోజీ ఫిలింసిటీలో ఎక్కువభాగం షూటింగ్ జరుగుతోందని ఆమె అన్నారు. సమకాలీన సమస్యలను ఈ సినిమాలో చర్చించామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంహా ఉంటుందని వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రంలో... అతుల్ కులకర్ణి, ఆహుతి ప్రసాద్, మిలింద్ సోమన్ ప్రత్యేక పాత్రలో... ఆర్టీసీ ఛైర్మన్ ఎం. సత్యనారాయణరావు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా... లోకి, వంశీ, రచన.... గంగోత్రి విశ్వనాథ్, రైటర్ మెన్, ఫైట్స్... హార్స్‌మెన్ బాబు, సంగీతం... ఎస్. చిన్నా, ఎడిటింగ్.... నందమూరి హరి, కథ, స్క్రీన్ ప్లే... డాక్టర్ రాజశేఖర్, సమర్పణ... సిరి మిడియా, శివానీ, శివాత్మిక మూవీస్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు డాక్టర్ రాజశేఖర్, సంజన సత్యమేవజయతే జీవిత దర్శకత్వం