పతాక సన్నివేశాల్లో "సాధు"
|
ఈ సందర్భంగా నిర్మాత రాజు మాట్లాడుతూ... హీరో చుట్టూ కథ నడుస్తుందని, కథాంశం అందరినీ ఆలోచింపజేస్తుందని చెప్పారు. ప్రస్తుతం మియాపూర్, రాజేంద్రనగర్ దేవాలయాల్లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిపారు. ఇందులో మూడు పాటలు చంద్రబోస్ రాశారని, చిన్నా చక్కటి సంగీతాన్ని అందించారని చెప్పారు.
దర్శకుడు అంజి మాట్లాడుతూ... హీరోతో పాటు... అప్పుడే పుట్టిన పిల్లవాడి చుట్టూ నడిచే కథ ఇదని చెప్పారు. ఇందులో "సాధు" పాత్రధారిగా నాగబాబు వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. అక్టోబర్ మాసాంతానికి ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని తెలిపారు.
కథానాయకుడు నాగబాబు మాట్లాడుతూ.... మంచి కథాంశంతో, చక్కని స్క్రీన్‌ప్లేతో అంజి తెరకెక్కిస్తున్నారన్నారు. అన్నిరకాల వాణిజ్య అంశాలతో నిర్మాత చక్కగా తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు.
డా. శివప్రసాద్, వల్లభనేని జనార్ధన్, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే....మల్లడి మోహనగాంధీ, మాటలు... వి.వి.వి దుర్గాప్రసాద్, ఆర్ట్.... నారాయణ రెడ్డి, కెమెరా, దర్శకత్వం....అంజి.