1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"కృష్ణం వందే జగద్గురుం"లో వెంకీ సరసన త్రిష!

వినోదం వెండితెర కథనాలు గమ్యం ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం కృష్ణం వందే జగద్గురుం వెంకీ సరసన త్రిష
"గమ్యం" ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ పతాకంపై విక్టరీ వెంకటేష్ హీరోగా నటించనున్న చిత్రం "కృష్ణం వందే జగద్గురుం". అశ్వనీదత్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో..."ఆడవారి మాటలకు అర్థాలే వేరులే"లో వెంకీతో జతకట్టిన అందాల ముద్దుగుమ్మ త్రిష హీరోయిన్ పాత్రను పోషించనుంది.

వెంకీ-త్రిష కాంబినేషన్‌లో "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" సినిమా బంపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. మరోవైపు పద్మభూషణ్ కమల్ హాసన్ దర్శకత్వం వహిస్తున్న "మర్మయోగి" సినిమాలోనూ త్రిష హీరోయిన్‌ ఛాన్స్‌ను కొట్టేసింది. ఈ సినిమా కోసం మొత్తంగా డేట్స్ ఇచ్చేసిన త్రిష... ప్రస్తుతం వెంకీ సరసన నటించేందుతు డేట్స్ కోసం వెతుకులాడుకుంటుందని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.

ఒకవైపు కమల్‌తో నటించేందుకు ఛాన్స్ రావడం, మరోవైపు హిట్ స్టార్ వెంకీతో నటించేందుకు అవకాశం రావడంతో త్రిష ఆనందంలో తేలియాడుతోందట. అంతేకాకుండా ఇరు సినిమాల్లో నటించేందుకుగానూ తన మేనేజర్‌తో డేట్స్‌ కోసం వెతకమని త్రిష తొందర పెడుతుందని సినీ వర్గాల సమాచారం.
About Writer
Selvi