"పరారే" ఆడియో విడుదల
ఉదయ్, ప్రియాంక జంటగా ఎమ్. వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "పరారే". శ్రీ వెంకటలక్ష్మీ పద్మావతి క్రియేషన్స్ పతాకంపై చెన్నుపాటి వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం భరద్వాజ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది.
ఆడియో సీడీని నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి హీరోకు అందించారు. ఆడియో క్యాసెట్‌ను "జాన్ అప్పారావు 40 ప్లస్" దర్శకుడు కూచపూడి వెంకట్ ఆవిష్కరించి చిత్ర దర్శకుడికి అందజేశారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త నీరు ప్రవహిస్తోందని, కొత్తవాళ్ళతో తీసే సినిమాలు బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు ఆదిరస్తారని తమ్మారెడ్డి పేర్కొన్నారు. నూతన తారలతో తీసిన ఈ చిత్రంలో కొత్తదనం ఉంటుందని కూచిపూడి వెంకట్ భావించారు.
చిత్ర దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ.. షూటింగ్ పూర్తయిందని, అందరి సహకారంతో చక్కటి చిత్రంగా వచ్చిందన్నారు. వచ్చేనెల 15న చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి సంగీతం... జి. మురళీస్వర్.