1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కె. విశ్వనాథ్‌కు "అల్లూరి" జాతీయ పురస్కారం

వినోదం వెండితెర కథనాలు ప్రముఖ దర్శకుడు అల్లురామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం సంస్థ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు
IFM
అల్లురామలింగయ్య కళాపీఠం తరపున అల్లురామలింగయ్య జాతీయ పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్‌కు బహూకరించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు తెలియజేశారు.

అక్టోబర్ 1న అల్లురామలింగయ్య జయంతిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం హరిహరకళాభవన్‌లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సారిపల్లి కొండలరావు అన్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వనాథ్‌కు జ్ఞాపికతోపాటు స్వర్ణకంకణంతో సత్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వేడుకకు ప్రముఖ గాయని పి. సుశీల ముఖ్యఅతిథిగా పాల్గొననున్నట్లు తెలిపారు. ఇంకా ప్రముఖ సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
About Writer
Selvi