గాయత్రి ఎలా ఉంటుంది?
|
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ... సినిమా టాకీ చివరి దశలో ఉందని, అక్టోబర్‌లో పాటలను చిత్రిస్తామని వెల్లడించారు. నవంబర్‌లో పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబరులో సినిమాను విడుదల చేయనున్నామని అన్నారు. సస్పెన్స్, థ్రిల్లర్‌తో రూపొందే ఎంటర్‌టైనర్ చిత్రమిదని పేర్కొన్నారు.
బెనర్జీ మాట్లాడుతూ... కన్నడంలో పలు చిత్రాలను నిర్మించిన సాయేంద్రరెడ్డి తెలుగులో తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారు. స్క్రీన్‌ప్లే బేస్డ్ చిత్రమిదని, ఇందులో పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నానని చెప్పారు.
షఫీ మాట్లాడుతూ... కథ చాలా బాగుందని, ఇందులో తాను నెగటివ్ పాత్రను పోషిస్తున్నానని తెలిపారు. పి.జె.శర్మ మాట్లాడుతూ.... తన గురుతుల్యులు నాగభూషణంగారి మనుమడు భూషణ్ హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు.
భూషణ్ నాగభూషణం అంతటి నటుడు కావాలని శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. రొటీన్‌గానే జడ్జిగా నటిస్తున్నానని, ఇటీవలే షిర్డిసాయిబాబాపై రూపొందిన శ్లోకాలకు తన వాయిస్ చెప్పించారని తెలిపారు. దానికి షిర్డీ సంస్థ "కళాఖంటీరవ" అనే బిరుదును ప్రదానం చేయడం సంతోషంగా ఉందని వెల్లడించారు.
ఈ చిత్రం తనకు మంచి గుర్తింపును తెస్తుందని గాయత్రీ రావ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ చిత్రానికైనా కథే హీరో అని అటువంటి మంచి కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని భూషణ్ తెలిపారు.
ఇంకా ఈ చిత్రంలో ఎం.ఎస్. నారాయణ, వైజాగ్ ప్రసాద్, గుండు హనుమంతరావు, గౌతంరాజు, హేమ, కళ్ళు చిదంబరం, గుండు సుదర్శన్, శ్రీకృష్ణ, జయవాణి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్... సురేందర్ రెడ్డి, ఎడిటర్.. అనిరుద్ర, ఆర్ట్... నారాయణ రెడ్డి, ఫైట్స్... సతీష్, నిర్మాణం.. లక్ష్మీ భవాని మూవీస్ ప్రై లిమిటెడ్.