1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

అక్టోబర్ 1న "కేక" ఆడియో ఆవిష్కరణ

వినోదం వెండితెర కథనాలు జయం చిత్రం కేక ఆడియో అక్టోబర్ ఒకటో తేదీ ఆదిత్య మ్యూజిక్
"జయం", "చిత్రం" వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన "తేజ" తాజా సినిమా "కేక". ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను అక్టోబర్ ఒకటో తేదీన విడుదల చేయనున్నారు.

ఆదిత్య మ్యూజిక్ ద్వారా "కేక" ఆడియో మార్కెట్లోకి విడుదల కానుంది. విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే తేజ... ఇప్పటికే "కేక" పాటలను ప్రచారం కోసం రేడియో స్టేషన్లకు అప్పగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో దాదాపు 36 మంది కొత్త ఆర్టిస్టులు నటిస్తున్నారు. "చిత్రం" మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న "కేక" సినిమాకు చక్రి సంగీతం సమకూర్చారు. పి.సి. శ్రీరామ్ కెమెరా పనితనం "కేక" సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల్లో టాక్. ఇకపోతే ఈ చిత్రాన్ని దసరా కానుకగా (అక్టోబర్ 9)న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు తేజ సన్నాహాలు చేస్తున్నారు,
About Writer
Selvi