1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"నక్షత్ర" షూటింగ్ ప్రారంభం

వినోదం వెండితెర కథనాలు నేస్తమా లంక బ్రదర్స్ నక్షత్ర ప్రీతిజింగాని వేణుగోపాల్ ముహూర్తపు షాట్
WD
"నేస్తమా" చిత్రాన్నినిర్మించిన లంక బ్రదర్స్ తాజాగా "నక్షత్ర" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్వాల్‌లో ప్రీతిజింగాని, వేణుగోపాల్‌పై ముహూర్తపు షాట్ చిత్రించారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన లంక శివశంకర్ మాట్లాడుతూ... తాము ఇంతకు ముందు నిర్మించిన నేస్తమా చిత్రం పలువురి ప్రశంసలందుకుందని, తమ రెండో చిత్రంగా వస్తున్న "నక్షత్రం" కూడా ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఈ చిత్రంలో ప్రీతిజింగాని ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, కథ, స్క్రీన్‌ప్లే యోధ సమకూర్చగా బాలకుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారని వెల్లడించారు.

ఒక ఆర్కాలజిస్ట్ ప్రాక్టికల్స్ నిమిత్తం ఫారెస్ట్‌కు వెళితే అక్కడేం జరిగింది? ఎలాంటి సంఘటనలను ఎదుర్కొన్నాడన్న రసవత్తర సన్నివేశాలతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నామన్నారు. రెండు షెడ్యూళ్లతో చిత్రాన్ని పూర్తిచేస్తామని అన్నారు.

ప్రభు కుమార్, కీర్తి, ఫరాఖాన్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం... శ్యామ్ ప్రసన్, కెమెరా.. ఓం ప్రకాష్, పాటలు... రెహమాన్, మాటలు.. త్రిపాల్, దర్శకత్వం... బాలకుమార్, నిర్మాతలు, లంక శివశంకర్, మర్రిపూడి భార్గవి, రాధాకృష్ణ.
About Writer
Selvi