అవకాశం గొప్పది: డాక్టర్ రాజేంద్రప్రసాద్
నటుడికి అవకాశం రావడమనేది చాలా గొప్పదని నటకిరీటి డాక్టర్. బాబూ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు దేవుని పాత్రలు, ఎ.ఎన్.ఆర్‌కు సామాజిక పాత్రలు ద్వారా అవకాశాలు వచ్చి వారు ఎంతో స్థాయికి ఎదిగారని రాజేంద్రప్రసాద్ అన్నారు. తమిళం, ఇంగ్లీషు భాషల్లో రూపొందిన "క్విక్ గన్ మురుగన్" అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నటించారు.
మాంటో క్రిస్టో ఇంటర్ నేషనల్ సమర్పణలో ఫాట్‌ఫిష్‌మోషన్ పిక్ఛర్స్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందుతోంది. దీనికి ఆనంద్ సురాపూర్ నిర్మాత సారధ్యాన్ని వహిస్తున్నారు. శశాంక్‌ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి ఫిలింకల్చరల్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
కౌబాయ్ లేటస్ట్‌గా ఎలా ఉంటాడు?
తొలిసారిగా దక్షిణాది నటుల్లో ఆంగ్ల చిత్రంలో నటించే అరుదైన అవకాశం తనకు దక్కిందని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తనకు ఇండ్రస్ట్రీలో "గాడ్ ఫాదర్స్" లేరని అన్నారు. "గాడ్" మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. 32 ఏళ్ళ సినీ కెరీర్‌లో తాను నమ్మిన సిద్ధాంతానికి అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు.
ఆ అవకాశం తనకు "క్విక్ గన్ మురుగన్" రూపంలో వచ్చిందన్నారు. ఇది తమిళ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కౌబాయ్ కథని చెప్పారు. ఏడాదిన్నర పాటు ఈ కథను తీర్చిదిద్దారని తెలిపారు. జాకీచాన్ చైనా వాడైనా ఇంగ్లీషులో చూస్తున్నామని తెలిపారు. అలాగే తమిళ నేపథ్యంలో "క్వక్ గన్ మురుగన్"ను ఆంగ్లంలో తీశారని చెప్పారు. 60-70 దశకంలో కౌబాయ్ క్యారెక్టర్ లేటెస్ట్‌గా తీసుకువస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా అని చెప్పారు. ఇందులో కామెడీ అంతర్జాతీయస్థాయిలో ఉంటుందని తెలిపారు.
చిన్న పాత్ర సినిమాగా మారింది..
బెంగాల్ దర్శకుడు శశాంక్‌ఘోష్ చిన్న పాత్రగా డాక్యుమెంటరీగా తీశారని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆ తర్వాత క్రమేణా ఫుల్‌లెంగ్త్‌గా మార్చి చిత్రంగా మార్చారని తెలిపారు. అవును ప్రేమించే పాత్రని కృష్ణుడిలాంటి దేవుని తత్త్వంకూడా ఉంటుందని తెలిపారు. శాఖాహారాన్ని ప్రోత్సాహించే కౌబాయ్ కథని చెప్పారు.
కథా పరంగా... విలన్ మాంసాహారాన్ని ప్రోత్సహిస్తాడని, శాఖాహారికి మాంసాహారానికి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రమని రాజేంద్రప్రసాద్ వివరించారు. ఈ చిత్రం ద్వారా మన సంస్కృతి కూడా వెలుగులోకి వస్తుందని చెప్పారు. తాను చేసిన ప్రతిసినిమాలో ఎంతో కొంత మేనేజ్ ఉంటుందని చెప్పారు. లేడీస్ టైలర్‌లో మూఢనమ్మకాలు మంచిదికాదని చెప్పామన్నారు. అలాగే "క్విక్ గన్ మురుగన్"లో శాఖాహారం మంచిదని సందేశముందని తెలిపారు.
లండన్ ఫెస్టివల్‌లో ప్రదర్శన
ఇంక ఈ చిత్ర విశేషమేమిటంటే....? ఈ నెల 16వ తేదీన లండన్ ఫిలిం ఫెస్టివల్‌లో సౌత్ ఏషియన్ కేటగిరిలో ఎంపికైన 5 చిత్రాల్లో "క్విక్ గన్ మురుగన్" ప్రదర్శనకు నోచుకోవడం అరుదైన విషయమని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. "మీ శ్రేయోభిలాషి" తర్వాత ఈ చిత్రంపై చాలాకాలం హోంవర్క్ చేశానని తెలిపారు. మరో ప్రత్యేకత ఏమిటంటే..? ఈ సినిమా ట్వంటీయత్ ఫాక్స్ సెంచురీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చి సినిమాను కొనేయడమని అన్నారు.
స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రత్యేకత
ఈ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్‌ను ఆస్కార్ అవార్డు విన్నర్ టీమ్ ఆధ్వర్యంలో జరగడం మరోవిశేషమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. హైదరాబాద్‌లోని నానక్ రామ్‌గూడాలో, ముంబైలోనూ, హాంకాక్ లోనూ చిత్రషూటింగ్ జరిగిందని చెప్పారు. లాస్ఏంజిల్స్‌లో స్పెషల్ ఎఫెక్ట్ జరిగాయని తెలిపారు. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అంతర్జాతీయ చిత్రం మెట్టుఎక్కానని చెప్పారు. ఈ పాత్రకోసం 25 రోజుల పాటు గుర్రపు స్వారీ నేర్చుకున్నాని తెలిపారు. కమిట్‌మెంట్‌తో ఈ సినిమాని చేశానన్నారు.
పాటలు ఉన్నాయి
ఈ పాత్రను ఎం.జి.ఆర్, ఎన్టీఆర్ లాంటి వాళ్లు చేయాల్సిందని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తనకు దక్కడం అరుదైన అవకాశమని, దక్షిణాది ప్రతి తెలుగువాడి ఇంటిలో మీడియా ద్వారా తన చిత్రాలు చూసే అవకాశం కల్గిందని, సర్వేచేశాక ఎక్కువ మంది తన పేరు ప్రతిపాదించడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మీడియాకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ దక్షిణాదిలో సర్వేచేశాక తన దగ్గరకు వచ్చారని చెప్పారు. ఇందులో అనూమీనన్ హీరోయిన్‌గా నటించిందని తెలిపారు. వ్యాంప్‌పాత్రను రంభ పోషించిందని తెలిపారు. ఆంగ్ల చిత్రమైనా తమిళ బ్యాక్‌డ్రాప్ కాబట్టి రెండు పాటలు ఉన్నాయని, ఎంజీఆర్ నటించిన ఓ చిత్రంలో సౌందర్‌రాజన్ పాడిన ఓ "లిటిల్ ప్లవర్ సీ యువర్ లవర్" అనే పాట కూడా ఒకటుందని చెప్పారు.
యాక్షన్ కొత్త అనుభవం
కౌబాయ్ చిత్రమనగానే యాక్షన్ పార్ట్ కంపల్‌సరీ అని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. చాలా సహజత్వంగా చిత్రించారని ఆయన చెప్పారు. అదొక కొత్త అనుభూతని, సేఫ్టీ ప్రికాయన్స్‌తో యాక్షన్‌పార్ట్ చేశానని చెప్పారు. రుతిక్‌రోషన్ చిత్రాలకు పనిచేసిన యాక్షన్ దర్శకుడు తీర్చిదిద్దారని చెప్పారు.
ఇంకా ఈ సినిమాలో నసిర్, గౌరవ్ కపూర్, సంధ్య మ్రిడుల్, వినయ్ పాఠక్, షణ్ముగరాజన్, రాజుసుందరమ్, తదితరులు నటిస్తున్నారు. సంగీతం.... డేనియల్ జార్జి, స్క్రీన్ ప్లే... రాజేష్ దేవ్ రాజ్, కెమెరా.... ఆర్.కె. కృష్ణ.