రమాప్రభకు విశేష పురస్కారం
డాక్టర్. రామినేని ఫౌండేషన్ (యూఎస్ఎ) ఈ ఏడాది విశేష పురస్కారాన్ని నటి రమాప్రభకు ఇవ్వనుంది. 1999లో అయ్యన్న చౌదరి స్థాపించిన ఈ ఫౌండేషన్ రామినేని ప్రేరణగా ఆయన కుమారులు ప్రతి ఏడాది అక్టోబర్ 12న వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికి అందజేస్తున్నారు. ఈ ఏడాదిన విశిష్ట పురస్కారాన్ని శాస్త్రవేత్త డా. కోటహరినారాయణకు అందజేస్తున్నారు.
మూడు విశేష పురస్కారాలను వేటపాలెం లైబ్రరీ ప్రెసిడెంట్ మల్లిఖార్జునరావుకు, సీనియర్ జర్నలిస్టు సి.వి. రాజగోపాల్‌కు, నటి రమాప్రభకు అందజేయనున్నారు. పురస్కార కార్యక్రమం అక్టోబర్ 12న తాజ్‌డెక్కన్‌లో జరుగుతుందని సంస్థ అధ్యక్షుడు రామినేని వేదాచార్య తెలిపారు.
ఈ కార్యక్రమానికి జస్టిస్ చలమేశ్వరరావు, మురళీమోహన్, జయసుధకపూర్‌లు హాజరుకానున్నారు. వెంపటి చినసత్యం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.