1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"సూర్య సన్నాఫ్ కృష్ణన్"గా వస్తున్న "గజిని"

వినోదం వెండితెర కథనాలు గజిని మరో డబ్బింగ్ సినిమా తెలుగు ప్రేక్షకులు సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఆస్కార్ రవి చంద్రన్
"గజిని" సూర్య మరో డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. సూర్య ద్విపాత్రాభినయం చేసిన "వారనం ఆయిరమ్" అనే తమిళ చిత్రాన్ని "సూర్య సన్నాఫ్ కృష్ణన్" పేరుతో తెలుగులోకి ఆస్కార్ రవి చంద్రన్ అనువదిస్తున్నారు.

సమీరా రెడ్డి, సిమ్రాన్, రమ్య కథానాయికలుగా నటిస్తున్నఈ చిత్రాన్ని "ఘర్షణ" ఫేం గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. దసరాకు చిత్ర ఆడియోను, దీపావళికి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

దర్శకుడిగా గంగరాజు కుమారుడ
దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు కుమారుడు గుణ్ణం సందీప్ త్వరలో దర్శకుడు కానున్నారు. "హ్యాపీడేస్" ఫేం వరుణ్ సందేశ్ హీరోగా ఆనంది ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళ చిత్రం "పొల్లాదవన్" ఆధారంగా ఇది రూపొందనుందని తెలిసింది.

సందీప్ గతంలో తన తండ్రి దర్శకత్వంలో శర్వానంద్, సుహాసిని, శ్రేయారెడ్డి ముఖ్యపాత్రలుగా పోషించిన "అమ్మ చెప్పింది" అనే చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వహించారు. దర్శకులైన కెమెరామెన్లు వరుసలో తేజ, రసూల్, యస్.గోపాల్ రెడ్డి, శివ వంటి వారు ఉండగా... వీరి బాటలో సందీప్ కూడా చేరుకున్నారు.
About Writer
Harsha Vardhan