1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఈసారి నటించలేదు: రామానాయుడు

వినోదం వెండితెర కథనాలు కౌసల్య సుప్రజ రామ ఈసారి నటించలేదు రామానాయుడు చిన్న వేషం హోప్ విజయదశమి కానుక
"నేను నిర్మించిన ప్రతి సినిమాలో వేషం వేసే వాడిని", ఈసారి నేను నిర్మించిన "కౌసల్య... సుప్రజ.. రామ"లో వేషం వేయలేదు. ప్రతి సినిమాలో డాక్టర్, లాయర్ వేషం వేసేవాడిని, సెన్సార్ వాళ్ళు కూడా కౌసల్య... సినిమాను చూసి తొలిసారిగా మీరు నటించని సినిమా ఇదేనని అన్నట్లు ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు అన్నారు.

ఈ సినిమాలో ఓ డాక్టర్ వేషం ఉందని, ఆ వేషాన్ని తన సంస్థ శ్రేయోభిలాషి చలపతిరావు చేత వేయించామని రామానాయుడు చెప్పారు. ఇంతకీ విషయమేమిటంటే? డాక్టర్ వేషం సంగతి అటుంచి కౌసల్య... సినిమాలోనే ఓ చిన్న వేషం ఉందని, "హోప్" వంటి అవార్డు సినిమాలో పెద్ద వేషం వేసిన తర్వాత చిన్నవేషం చేస్తే బాగోదని వేయలేదని రామానాయుడు చమత్కరించారు.

రామానాయుడు నిర్మాణ సారథ్యం వహించిన కౌసల్య... సుప్రజా.. రామ సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చిత్రం గురించి చెబుతూ... శ్రీకాంత్, ఛార్మీ, గౌరిముంజల్‌తో పాటు ఈ చిత్రంలోని ప్రతి పాత్ర చక్కగా చేశారన్నారు. ఆడియోకు మంచి స్పందన లభించిందని, అలాగే సినిమా కూడా విజయవంతమవుతుందని చెప్పారు.

చిత్ర దర్శకుడు సూర్యప్రసాద్ మాట్లాడుతూ... తొలికాపీ చూశాక రామానాయుడు చాలా హ్యాపీగా ఫీలై తిరుపతికి కూడావెళ్ళొచ్చారన్నారు. సెన్సార్ ప్రశంసలు పొందిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు కూడా పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అందరూ తెలుగువారే ఈ చిత్రంలో నటించారని నటుడు చలపతి రావు పేర్కొన్నారు. మిమిక్రీ ఆర్టిస్టు అయిన తనకు వేషాలిచ్చిన చిత్ర నిర్మాత రామానాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని శివారెడ్డి అన్నారు. "దసరానాడు ఉగాది పచ్చడి తిన్నంత హాయిగా ఈ చిత్రముంటుందని నటి సైరాభాను తెలిపారు.
About Writer
Harsha Vardhan