1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"కొత్త బంగారు లోకం" సెన్సార్‌ పూర్తి

వినోదం వెండితెర కథనాలు హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్సందేశ్ శ్వేతప్రసాద్ దిల్రాజు కొత్త బంగారు లోకం శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారు లోకం
"హ్యాపీడేస్" ఫేమ్ వరుణ్‌సందేశ్, శ్వేతప్రసాద్ హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ దిల్‌రాజు నిర్మించిన చిత్రం "కొత్త బంగారు లోకం". శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... సెన్సార్ అభినందనలు పరీక్షల్లో పాసైనంత ఆనందాన్నిచ్చిందని చెప్పారు.

శ్రీకాంత్ చెప్పిన కథను రెండేళ్లపాటు కృషిచేసి తీర్చిదిద్దామని, ఇటీవలే ఈ చిత్రాన్ని తన శ్రేయోభిలాషులకు కూడా చూపించానని వెల్లడించారు. సినిమా చూసిన వారంతా రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ... మొదటి భాగమే అద్భుతంగా ఉందని, క్లైమాక్స్ ఊహించనివిధంగా ఉందని, కామెడీ హైలైట్‌ అని, హీరోహీరోయిన్లు కథకు చక్కగా అమరారని అభినందిస్తుంటే... రెండేళ్ల శ్రమకు తగిన ఫలితం దక్కిందనే ఆనందం కల్గిందన్నారు. ఇదే అభిప్రాయాన్ని ఈ నెల 9న ప్రేక్షకులు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ... సినిమాను చూశానని, సెన్సిటివ్ లవ్‌స్టోరీ అని, ఇంతవరకు తెలుగులో ఈ తరహా చిత్రం రాలేదన్నారు. శ్రీకాంత్ అద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు.

సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ మాట్లాడుతూ... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కు మంచి అవకాశం లభించిందని, సందేశ్ తన పాత్రను బాగా పండించాడన్నారు. ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకముందని మేయర్ ఆశించారు.

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ... "హ్యాపీడేస్" తర్వాత తనకు మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించారని, పాత్రపరంగా చాలా వేరియేషన్స్ ఉన్నాయని చెప్పారు. దర్శకుడు నటనాపరంగా తనకెంతో సహకరించారని తెలిపారు.
About Writer
Harsha Vardhan