"మా అల్లుడు లవంగం" ఆడియో విడుదల
కృష్ణభగవాన్ మామగా, విజయభాస్కర్ అల్లుడిగా నటిస్తున్న చిత్రం "మా అల్లుడు లవంగం". శ్రీరంగం సతీష్ కుమార్ దర్శకత్వంలో తలుపులమ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పాలాటి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను నిర్మాత సన్నిహితుడు వేలూరు సురేందర్ రెడ్డి ఆవిష్కరించి "హాలీడేస్" కథానాయకుడు శివనాగ్‌కు అందించారు.
పూర్తి హాస్యభరితంగా ఈ చిత్రం రూపొందిందని, కృష్ణభగవాన్ క్యారెక్టర్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు చెప్పారు. సంగీతం అద్భుతంగా వచ్చిందని, సినిమాకు టైటిల్, కృష్ణభగవాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని హీరో విజయ భాస్కర్ చెప్పారు.
పాటలు విజువల్‌గా కూడా బాగున్నాయని సంగీత దర్శకుడు ప్రదీప్ రాజా చెప్పారు. ఈ నెల మూడో వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రదీప్ రాజా వెల్లడించారు.
రూపారెడ్డి, ప్రియ, శాంతి, రాక్, నాని, కొండవలస లక్ష్మణరావు, రఘునాధ రెడ్డి, జూనియర్ రేలంగి, తిరుపతి ప్రకాష్, రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్... విజయ కృష్ణ, పాటలు... రామారావు, ఫోటోగ్రఫీ... సత్తిబాబు.