టర్కీ చిత్రోత్సవంలో "మిషన్ ఇస్తాంబుల్"
శుక్రవారం నుంచి దక్షిణ టర్కీలో ప్రారంభం కానున్న నాలుగవ ఇంటర్నేషనల్ యూరేషియా చిత్రోత్సవంలో సాహస ప్రాధాన్యంతో రూపొందిన హిందీ థ్రిల్లర్ మూవీ "మిషన్ ఇస్తాంబుల్" ను ప్రదర్శించనున్నారు. ఈ చిత్రోత్సవంలో భాగంగా 45వ గోల్డెన్ ఆరెంజ్ పిల్మ్ ఫెస్టివల్‌ను, ఫిలిం మార్కెట్‌ను కూడా నిర్వహించనున్నారు.
టర్కీలో సినిమా, ఆడియో వీడియో సంస్కృతికి ప్రతీక టర్‌శాక్ ఆధ్వర్యంలో ఈ చిత్రోత్సవాన్ని అక్టోబర్ 10 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. అపూర్వ లతిక దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం "మిషన్ ఇస్తాంబుల్" ఆగస్టు నెలలో విడుదలైంది. ఈ చిత్రంలో జయేద్ ఖాన్, వివేక్ ఓబెరాయ్, శ్రియా శరణ్, షబీర్ అహ్లువాలియా, నికిటిని ధీర్ ప్రధాన తారాగణం కాగా శ్వేతా భరద్వాజ్ కొత్తగా పరిచయం అయారు. కాగా, సునీల్ షెట్టీ, అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలు పోషించారు.
ఈ చిత్ర కథ ఉగ్రవాద నేపథ్యంలో కొనసాగుతుంది. తాను పనిచేస్తున్న ఇస్తాంబుల్ కేంద్రంగా నడిచే వార్తా ఛానెల్ వాస్తవానికి ఆప్ఘనిస్తాన్, భారత్‌లలో తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న ఒక ఉగ్రవాద సంస్థకు ప్రధాన కేంద్రంగా ఉంటోందని భారతీయ జర్నలిస్టు గ్రహిస్తాడు. తర్వాత అతడు ఈ ఉగ్రవాద సంస్థ పని పట్టడానికి టర్కిష్ కమాండోగా గతంలో పనిచేసిన ఓ మహిళ సహాయం తీసుకుంటాడు.
ఈ చిత్రోత్సవంలో ఆసియా తరపును ప్రదర్శించబడుతున్న ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాల నుంచి పలు చిత్రాలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించబడనున్నాయి. కేన్స్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణ హస్త పతకాన్ని అందుకున్న ది క్లాస్, వూడీ అలెన్ నటించిన వికీ క్రిస్టినా బార్సెలోనా, చార్లీ కాఫ్‌మన్ తీసిన న్యూయార్క్ వంటి ప్రధాన చిత్రాలు కూడా ఇక్కడ పదర్శనకు వచ్చాయి.