1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రాజీవ్ కనకాల "పాయిజన్"

వినోదం వెండితెర కథనాలు రాజీవ్ కనకాల నాగేంద్రప్రసాద్ విజయ్ సామ్రాట్ సింధు తులాని
రాజీవ్ కనకాల, నాగేంద్రప్రసాద్, విజయ్ సామ్రాట్ కథానాయకులుగా, సింధు తులాని, సుహాసిని కథానాయికలుగా, ఫణిరాజు దర్శకత్వంలో డి. రమేష్ బాబు నిర్మిస్తున్న చిత్రానికి "పాయిజన్" అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. రాజీవ్ మాట్లాడుతూ... చిత్రానికి ఏ టైటిల్ పెట్టాలా? అని ఆలోచిస్తుండగా కథానాయికల్లో ఒకరైన సుహాసిని సూచించిన ఈ టైటిల్ అందరికీ నచ్చిందని, దీంతో అదే టైటిల్‌ను ఖరారు చేశామన్నారు.

సినిమాను కథకు అనుగుణంగా దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దారని సింధు తులానీ చెప్పారు. ఈ టైటిల్ పెట్టడంలో తన గొప్పతనమేమీ లేదని, తాను సూచించిన టైటిల్ పెట్టిన నిర్మాతదే ఆ గొప్పతనమని సుహాసిని అన్నారు.

దర్శకుడు ఫణిరాజ్ మాట్లాడుతూ... సింధుతులానిపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామన్నారు. ఈ నెలాఖరుకు సినిమా పూర్తవుతుందని నిర్మాత రమేషే చెప్పారు.

ముమైత్ ఖాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ, ఎ.వి.ఎస్. శ్రీనివాస రెడ్డి, గీతాసింగ్, మేల్కోటె, వాసు ఇంటూరి, సత్తెన్న తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం... చంద్రలేఖ, మాటలు.. రామస్వామి.
About Writer
SELVI.M