చంద్రశేఖర్ ఏలేటి ప్రయాణం
"ఐతే", "అనుకోకుండా ఒక రోజు", "ఒక్కడున్నాడు" చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి త్వరలో ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. మనోజ్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రానికి "ప్రయాణం" అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏలేటి తొలిసారిగా రొమాంటిక్ డ్రామా చిత్రాన్ని మలచడం గమనార్హం.
ఎయిర్‌పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో, విమాన ప్రయాణం నేపథ్యంలో కథ నడుస్తుందని, అందుకే ఈ చిత్రానికి "ప్రయాణం" అన్న టైటిల్ అయితే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలిసింది. నవంబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
ఎయిర్‌పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో, విమాన ప్రయాణం నేపథ్యంలో కథ నడుస్తుందని, అందుకే ఈ చిత్రానికి "ప్రయాణం" అన్న టైటిల్ అయితే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలిసింది. నవంబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.