1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఫిరోజ్, నఫిజా జోడీగా కొత్త చిత్రం!

వినోదం వెండితెర కథనాలు ఫిరోజ్ నఫిజా నళిని షూటింగ్ తెలుగు
WD
ఫిరోజ్, నఫిజా, నళిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షార్వి దర్శకత్వంలో ఎన్. సుబ్రమణియన్, ఎన్. లక్ష్మణన్ నిర్మిస్తున్నారు. నఫిజా, చిన్నాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ముఖ్య అతిథి, నిర్మాత సురేందర్ రెడ్డి క్లాప్ కొట్టగా, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత సి. సురేష్ మాట్లాడుతూ... భారీ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలనుకున్నట్లు చెప్పారు. వైవిధ్య కథ, కథనాలతో తెరకెక్కిస్తున్నామని, తెలుగులో తనకిది తొలి చిత్రమని దర్శకుడు చెప్పారు.

మ్యూజిక్ డైరక్టర్ మీరాలాల్ మాట్లాడుతూ... కీబోర్డ్ ప్లేయరైన తాను తొలిసారి సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నానని, కథ బాగా కుదిరిందన్నారు. ఈ సినిమాలో ఐదు పాటలున్నాయని, నిర్మాత, దర్శకులు తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని వెల్లడించారు.

కథానాయిక నఫిజా మాట్లాడుతూ... నాలుగైదు హిందీ చిత్రాల్లో నటించానని, ఈ చిత్రం ద్వారా తెలుగులో కథానాయికగా పరిచయమవుతున్నానన్నారు. మాంత్రికుడి వేషంలో నటిస్తున్నానని చిన్నా చెప్పారు. భువనేశ్వరి, రామ్ కుమార్, వింధ్యా, వాసు విక్రం, అజయ్ రత్నం, సుందర్, చాప్లిన్ బాబు, అలెక్స్, కన్నన్, బాలు, ఆనంద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా.. రాజు, వి. కృష్ణా, ఎడిటింగ్... అనీల్, మాటలు... బి.వి.రాజు.
About Writer
SELVI.M