1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రెండో షెడ్యూల్‌కు చేరుకున్న "కామెడీ ఎక్స్‌ప్రెస్"

వినోదం వెండితెర కథనాలు టీవీ మీడియా శ్రీనివాస్ కస్తూరి  కె శంకర్ రెడ్డి కామెడీ ఎక్స్ప్రెస్ లక్షల నవ్వుల వేగం రెండో షెడ్యూల్
WD
టీవీ మీడియా పతాకంపై శ్రీనివాస్ కస్తూరి దర్శకత్వంలో కె. శంకర్ రెడ్డి నిర్మిస్తున్న "కామెడీ ఎక్స్‌ప్రెస్" (లక్షల నవ్వుల వేగంతో) చిత్రం రెండో షెడ్యూల్‌లోకి అడుగుపెట్టింది. ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే ధ్యేయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ ప్రథమార్థంలో పాటల చిత్రీకరణ పూర్తి చేస్తామని నిర్మాత కె. శంకర్ రెడ్డి అన్నారు.

అదే నెల చివరి వారంలో పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను ముగించుకుని డిసెంబరులో సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. కుటుంబసమేతంగా రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునే విధంగా ఈ సినిమాను ముస్తాబు చేస్తున్నామని దర్శకుడు శ్రీనివాస్ కస్తూరి చెప్పారు.

కౌషల్, రాజేష్, శ్రీనివాసరెడ్డి, ఆషాసైని (మయూరి), ధర్మవరపు, సారిక రామచంద్రరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ... జయపాల్, ఎడిటింగ్... కె. రవీంద్రబాబు, మాటలు, స్క్రీన్‌ప్లే... మాధవ్, సంగీతం... సామ్‌డికాస్టో.
About Writer
SELVI.M