కౌన్సిల్ నిర్ణయాలపై నల్లమలుపు బుజ్జి ఆగ్రహం
ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న పలు నిర్ణయాలపట్ల "చింతకాయల రవి" నిర్మాత నల్లమలుపు బుజ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలు తీయని వారు, పదవుల కోసం పాకులాడేవారు కౌన్సిల్‌ను శాసిస్తున్నారని, వారి నిర్ణయాలు సినిమాలు తీసే వారిపై ప్రభావం చూపుతున్నాయని విమర్శించారు. రెండు వారాల టిక్కెట్‌రేటు నిలుపుదల వల్ల పెద్ద నిర్మాతలకు భారీగా నష్టం వస్తుందన్నారు.
ప్రేక్షకుల్ని దోచుకోవడానికే టిక్కెట్ పెంపు అన్నవారిపై ఘాటుగా స్పందిస్తూ... పైరసీ నివారణ కోసమే ఆనాడు ఈ నిర్ణయం తీసుకున్నదే తప్పనిస్తే ప్రేక్షకుల్ని దోచాలని కాదని స్పష్టం చేశారు. ఇటువంటి నిర్ణయం వల్ల నిర్మాతే దోపిడీకి గురయ్యాడని అన్నారు. ఆనాడు ఇండస్ట్రీ పెద్దగా చెప్పుకునే దాసరి నిర్ణయం వల్లే టిక్కెట్ రేటు పెంచారన్నారు.
మరి ఈనాడు ఆయన పంపిణీ రంగంలో లేడు గనుక తనకేమీ లాభం లేదని గ్రహించి చిన్న నిర్మాతలకు లాభం పేరుతో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని బుజ్జి ఘాటుగా స్పందించారు. పైరసీ నివారణకు సెల్ ఉన్నా స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి నీరుగారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు వారాల టిక్కెట్ పెంపు 12 చిత్రాలకు వర్తించేలా ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అందులో పవన్ కళ్యాణ్ పులి, రామచరణ్ తేజ చిత్రాలుండే సరికి వాటిని బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. ఆ రెండు చిత్రాల వల్ల మిగిలిన నిర్మాతలకు అన్యాయం జరిగిందన్నారు.
గురువారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో... నల్లమలుపు బుజ్జి పై విధంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి... కానీ నిర్మాతలు ఎక్కడికీ పోరని చెప్పారు. "చింతకాయల రవి" సినిమాను అందరూ బాగుందంటున్నారని, కానీ ఆదాయం లేదని, సినిమా హిట్టయినా తృప్తిలేదని బుజ్జి వాపోయారు.
భారతదేశంలో థియేటర్‌లో బాల్కనీ రేటు అత్యంత తక్కువ ధర ఒక్క ఆంధ్రప్రదేశ్, బీహార్, అస్సాంలోనూ 60-80 రూపాయలుందని, మన రాష్ట్రంలో 2001 నాడు బాల్కనీ టిక్కెట్ 50 రూపాయలయితే, 2008 నాటికి 35 రూపాయలుగా నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మనిషి ఆర్థికరేటు ఏడాదికేడాది పెరుగుతుంటే టిక్కెటు రేటు తగ్గడం, రెండు వారాల పెంపు రద్దు నిర్ణయాల వల్ల నిర్మాతల ఆర్థికరేటు దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వారాల టిక్కెట్ రేటు నిలిపివేయడం పట్ల పైరసీ పెరిగిపోయిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని బుజ్జి ప్రశ్నించారు. పైరసీ సెల్ కుంటి గుర్రంలా ఉందన్నారు.
తన సినిమా పైరసీని తానే 30 రూపాయలకు కొన్నానని, ఇప్పటివరకు 40 కేసులు పెట్టానని, తిరుపతి-చెన్నై, విజయవాడ రైళ్లలో నాలుగువేల పైరసీ సీడీలు పట్టుకున్నామని చెప్పారు. మొన్నటికి మొన్న చిలకలూరి పేటలో కేబుల్ టీవీలో "చింతకాయలరవి" సినిమా ప్రదర్శిస్తే కేసు పెట్టామన్నారు.
కానీ ఎం.ఎల్.ఎ. వచ్చి అతన్ని విడిపించుకుపోయారని, మరోచోట ఐదువేల జరిమానాతో కేసుకు పరిష్కారాన్ని పోలీసులు చూపారని చెప్పారు. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? కోట్లు పెట్టి తీసిన నిర్మాతలను ప్రభుత్వ అనాలోచనా నిర్ణయాలే దోచుకుంటున్నాయని ఘాటుగా స్పందించారు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పైరసీపై కఠినతరమైన చట్టం తేవాలని బుజ్జి విజ్ఞప్తి చేశారు.